కర్నూలు : జిల్లాలోని కౌతాలం మండలం, నదిచాగి, కత్రికి గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
అయితే, కత్రికి గ్రామంలోని మైదానంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. అదే సమయంలో వర్షం కురవడంతో సమీపంలోని కిందికి వెళ్లారు. అదే సమయంలో, మైదానంలో పిడుగు పడటంతో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
కత్రికి గ్రామానికి చెందిన అశోక్ (22), బాలయ్య (20) పిడుగుపాటుకు గురై మరణించారు. సెలవులకు ఇంటికి వచ్చిన తమ పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదే ఘటనలో నిరుపతి (14), గంగాధర (22) కూడా గాయపడ్డారు.