విజయవాడ : విజయవాడ సబ్ జైలులో వంశీతో ములాఖత్ అవ్వనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పరామర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు గాంధీ నగర్ జిల్లా జైలు వద్దకు చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు కూడా జగన్ వెంట వెళ్లనున్నారు. వంశీతో ములాఖత్ అయి ధైర్యం చెప్పనున్నారు. వంశీ అరెస్ట్ పై జైలు బయట స్పందించనున్నారు జగన్. మరోవైపు వంశీకి బెయిల్ పై ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
ఇక బెంగళూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి నేటి ఉదయం చేరుకున్నారు జగన్. గన్నవరం విమనాశ్రయంలో జగన్ కు స్వాగతం పలికారు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి వెళ్లారు.