ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. .. ఇవాళ్టి నుంచి రెండు సంవత్సరాల పాటు డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్యానెల్ నుంచి హరీష్ కుమార్ గుప్తా పేరును సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు.
హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్ కు చెందిన వ్యక్తి. జనవరి 31న అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయడంతో.. ఇన్ఛార్జి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. తాజాగా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించింది.ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

