AP | ప్రజల కోసం..
AP, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గంలోని ధనియాలపేట వార్డులో ఎమ్మెల్యే (MLA) వెనిగండ్ల రాము పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజ్, మంచినీటి సరఫరా సమస్యలను ఎమ్మెల్యే రాము మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించి, కొన్ని సమస్యల పై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంచినీటి సరఫరాలో ఉన్న ఇబ్బందులను త్వరలోనే పరిష్కరిస్తామని, వార్డులో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రాము ప్రజలకు హామీ ఇచ్చారు.
అలాగే డ్రైనేజ్, రోడ్ల పనులను పరిశీలించి, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, వార్డు నాయకులు చేకూరు జగన్మోహనరావు, రామ్ దేని వేణు, వంగపండు ఆదినారాయణ, మజ్జడా నాగరాజు, దేవాది నాగేశ్వరరావు, నరేంద్ర, చోటు తదితరులతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

