అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు AP CM Chandra Babu) నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విజయవాడ (Vijayawada ) నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బయలుదేరి..11.40కి వైజాగ్ విమానాశ్రయానికి ( airport ) చేరుకుంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం (yoga Day) సందర్భంగా 21న నిర్వహించనున్న వేడుకల నేపధ్యంలో చంద్రబాబు ఈ పర్యటన చేపట్టారు.బీచ్ రోడ్, ఏయూ పరిశీలన..ఈ టూర్ లో భాగంగా చంద్రబాబు ముందుగా బీచ్ రోడ్డులో ప్రధాన వేదికలు, జన సమీకరణ ప్రాంతాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.
అనంతరం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి వెళ్లి అక్కడ సభ ఏర్పాట్లను పరిశీలిస్తారు. అలానే వేడుకకు యూనివర్సిటీలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు.నోవాటెల్‌లో అధికారులతో సమీక్ష..బీచ్ రోడ్, ఏయూ మైదానాల్లో పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు నోవాటెల్ హోటల్‌కి చేరుకుంటారు.
రాష్ట్ర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. యోగా వేడుకల్లో భద్రత, ప్రజల రాకపోకలు, వేదికల ఏర్పాట్లు, లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ భేటీలో పలు శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని సమాచారం.ఇక తరువాత చంద్రబాబు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ (పీఎంపాలెం)కి చేరుకుని.. టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా యోగా వేడుకల్లో భారీగా జన సమీకరణ కోసం పార్టీ శ్రేణులు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా యువత, మహిళా విభాగాల పాత్రపై సీఎం దృష్టి సారించనున్నారు.ప
ల్లా శ్రీనివాసరావు కుటుంబానికి పరామర్శ..
చివరగా సాయంత్రం సమయంలో చంద్రబాబు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇటీవల పల్లా కుటుంబంలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో వారిని వ్యక్తిగతంగా పరామర్శించనున్నారు.
పర్యటన ముగిసిన అనంతరం చంద్రబాబు రాత్రికల్లా విజయవాడకు తిరిగి బయలుదేరి రానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విశాఖ నగరంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ వాహనాలకు మార్గనిర్దేశం, బీచ్‌రోడ్‌లో పబ్లిక్ యాక్సెస్ పరిమితి వంటి చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, గూడూరు పార్థసారథి, ఇంకా ఉత్తరాంధ్రకు చెందిన ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆదివారమే విశాఖపట్నం చేరుకొని సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను సమీక్షిస్తూ, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. విశాఖపట్నం వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకల కోసం ఆర్ కె బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి వరకు యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు.. నగర బ్రాండ్ ఇమేజ్‌ను ఈ కార్యక్రమంతో మరింత బలపర్చాలని భావిస్తున్నారు.