AP CM | అలా చేయడమే నా లక్ష్యం

AP CM | అలా చేయడమే నా లక్ష్యం

AP CM | తిరుపతి (రాయలసీమ ) ప్రభన్యూస్ బ్యూరో : రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యన్నిటినీ పరిష్కరించి 2027 నాటికి భూ వివాదాలు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. గురువారం సాయంత్రం నారావారిపల్లె లో ఏర్పాటు చేసిన మీడియా (Media) సమావేశం లో ఆయన మాట్లాడుతూ పుట్టిన గ్రామంతో అనుబంధం కొనసాగిస్తూ అభివృద్ధి చేయడానికి కృషి చేసే విధానం పై అందరిలో స్ఫూర్తి నింపడానికే తాను స్వగ్రామంలో సంక్రాంతి పండుగ చేసుకునే ఆనవాయితీ ని 10 ఏళ్లకు పైగా కొనసాగిస్తున్నానన్నారు. తనకన్నాముందునుంచి తన భార్య పదహారేళ్ళ మొదలుపెట్టడమే తనకు స్ఫూర్తి ఇచ్చిందన్నారు. పుట్టిన ఊరికి ఏదోఒక మేలు చేయాలనే సంకల్పానికి నాంది జరిగిందన్నారు.

AP CM

అందులో నుంచే ఒకప్పటి జన్మభూమి కార్యక్రమం, ఇప్పటి పి 4, మార్గదర్శి, బంగారుకుంటుంబం వంటి స్వల్ప దీర్ఘకాలిక ప్రయోజన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ప్రజల్లో లభిస్తున్న స్పందన తనకు సంతృప్తి ఇస్తోందన్నారు. మరోవైపు తమ గ్రామం పరిసరాల్లోని కందులవారి పల్లె, చిన్నరామాపురం, రంగంపేట పంచాయతీల పరిధుల్లో గత ఏడాది మొదలు పెట్టిన స్వర్ణ నారావారిపల్లె వచ్చే ఏడాది కి పూర్తి స్థాయిలో ఫలితాలను అందిస్తుందన్నారు. ఇంకో వైపు గత ప్రభుత్వ (GOVT) అస్తవ్యస్త పనుల వల్ల రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసమే సర్వే చేపట్టామని తెలిపారు. ఏడాది పాటు కొనసాగే ఆ సర్వే ద్వారా ప్రతి ఒక్కరి భూమి హక్కులు పరిరక్షించే అవకాశం లభిస్తుందన్నారు.

AP CM

సాంకేతిక పరిజ్ఞానంతో ఒకరి భూమి పత్రాలను ఎవరూ టాంపరింగ్ చేయడానికి వీలులేని విధంగా రికార్డులను రాజముద్ర తో అందిస్తామ్మన్నారు. 2027 నాటికి భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కరించి రాష్ట్రంలో భూ వివాధాలే లేకుండా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. ఈ మీడియా సమావేశం లో చిత్తూరు (Chittoor) ఎం పి ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు

CLICK HERE TO READ పయనీర్ ఆధ్వర్యంలోభారీ ఎయిర్ క్రాఫ్ట్ హబ్

CLICK HERE TO READ MORE

Leave a Reply