AP | అలా చేయడం వల్లే..

AP | అలా చేయడం వల్లే..

AP, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ (Mandali Buddha prasad) అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం అవనిగడ్డ శాఖా గ్రంథాలయంలో జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలకు మహత్తర చరిత్ర ఉందని, ప్రతీ ఒక్కరూ గ్రంథ పఠనం చేయటం చాలా అత్యవసరమన్నారు. తాను హైస్కూల్లో చదివే సమయంలో గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడినని, అలా చదవటం ద్వారానే ఇలా ఎదిగామని తెలిపారు. మా పాఠశాల ఉపాధ్యాయులు మంచి గ్రంథం ఏదైనా వస్తే.. చదవమని చెప్పేవారని, వారి సూచనలతోనే నేను పుస్తకాల పురుగుగా మారానని తెలిపారు. నేటి పిల్లలను కేవలం బట్టీ పట్టించే విధానంలోనే ఉంచుతున్నారని, పరిపూర్ణ విజ్ఞాన వంతులను చేయాలనే ఆలోచన కరువైందన్నారు.

గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయ ఉద్యమం స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు కొనసాగిందని తెలిపారు. గ్రంథాలయ ఉద్యమాన్ని విస్తరింప చేసిన వ్యక్తి అయ్యంకి వెంకట రమణయ్య ఎంతగానో శ్రమించారని తెలిపారు. గ్రంథాలయాలు సందర్శించటం ద్వారా సంపూర్ణ విజ్ఞానం సంపాదించుకోగలమని తెలిపారు. తొలుత గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

Leave a Reply