AP | ఎలక్ట్రానిక్స్‌కు భారీ ప్రోత్సాహం

  • ఏపీలో తైవాన్ కంపెనీల పెట్టుబడులు
  • తైవాన్ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ భేటీ

ఏపీలో ఎలక్ట్రానిక్స్ తయారీని బలోపేతం చేయడంపై… తైవాన్‌ సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్‌ కోరారు. ఈ మేర‌కు ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్‌తో నారా లోకేశ్ చర్చలు జరిపారు.

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్‌ రంగాల అభివృద్ధికి.. ఆయా రంగాలు తీసుకుంటున్న విధానాలు, చర్యలపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలో తైవాన్ కంపెనీల ప్రాతినిధ్యం, ఉద్యోగావకాశాలు పెరిగేలా చర్చలు జరిపినట్లు లోకేష్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆయా రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న విధానాలు, అనుమతులు, ఉత్పత్తి, అందిస్తున్న సహకారాన్ని లోకేష్ వివరించారు. ఏపీలో తైవాన్ కంపెనీలు సులభంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏపీలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తైవాన్ బృందం తెలిపింది.

Leave a Reply