HYD | రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతా : లావణ్య

  • మ‌స్తాన్ సాయి వల్ల నా జీవితం నాశ‌న‌మైంది
  • నాకు ప్రాణాపాయం ఉంది..

మ‌స్తాన్ సాయిని ఆదారాల‌తో స‌హా పోలీసుల‌కు ప‌ట్టించిన లావ‌న్య‌.. మ‌రోసారి మీడియా ముందుకు వ‌చ్చింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని.. ‘‘ఏ క్షణంలోనైనా త‌న‌ను చంపేయెచ్చు.. సమాజం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదని తెలిసి ప్రాణం, మానంతో పోరాడుతున్నానని’’ లావణ్య తెలిపింది.

ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదని.. మస్తాన్ సాయి, అతని కుటుంబం నా జీవితాన్ని నాశనం చేశారంటూ లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్‌కి క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నట్టు తెలిపింది. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది లావణ్య.

రాజ్ తరుణ్‌తో చాలా సంతోషంగా ఉండేదాన్నని లావణ్య తెలిపింది. మస్తాన్ సాయి వచ్చినప్పటి నుంచి మా మధ్య గొడవలు మొదలయ్యాయని ఆమె వెల్లడించారు.

Leave a Reply