రాష్ట్ర రాజధాని అమరావతి..

రాష్ట్ర రాజధాని అమరావతి..

సంబరాలు నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు రవికుమార్.
టీడీపీ కార్యాలయంలో సంబరాలు.

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : ఇకపై రాష్ట్ర రాజధాని అమరావతి అని స్థానిక 64వ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు.కేంద్ర,రాష్ట్ర చట్ట సభల సమావేశాలలో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం నిజంగా మధురమైన ఘట్టామని ఆయన అన్నారు. అమరావతి ను రాష్ట్ర రాజదానిగా ప్రకటించడంతో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు.సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు స్థానిక 64వ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ ఆధ్వర్యంలో డివిజన్లో శ్రేణులు, ప్రజలు ఇళ్ళ ముందు దీపాలు వెలిగించి మన రాజధాని అమరావతికి దీపాహారతులు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు, కాకోల్ల హర్ష సాయి, యూనిట్ ఇన్చార్జ్ కోమరి రాజేష్ , నల్లిపోకు కన్నా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply