పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం నాగేశ్వరావుపేట, మల్లేశ్వరం గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పేదల సేవలో – ఎన్టీఆర్ భరోసా పెన్షన్” లబ్ధిదారుల ఇళ్ళ వద్దకే వెళ్లి స్వయంగా అందజేసిన పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ.ప్రజల మంచి కోసం ఎప్పుడూ ఆలోచించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని నిరంతర ప్రక్రియగా మార్చారు. ఆయన ప్రణాళికల ఫలితంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మరింత పారదర్శకంగా, సులభంగా లబ్ధిదారులకు చేరుతున్నాయి.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply