రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు..

రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు..

ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ మహబూబ్ షేక్.

ఆంధ్రప్రభ, విజయవాడ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మెహబూబ్ షేక్ ఎం & ఎం మసీదులో నమాజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పర్వదినం సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే సందర్భమని పేర్కొన్న ఆయన, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని, శాంతి, సామరస్య వాతావరణం కొనసాగాలని కోరుకున్నారు.

Leave a Reply