గ్యాస్ కోసం క్యూ లైన్ లో ప్రజలు..

గ్యాస్ కోసం క్యూ లైన్ లో ప్రజలు..
మచిలీపట్నంలో బారులు తీరిన లబ్ధిదారులు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలో గ్యాస్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. గ్యాస్ కొరత ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు గ్యాస్ కంపెనీల వద్ద క్యూ కట్టవలసి వస్తుంది. అధికారులు గ్యాస్ కొరతలేదని ప్రకటనలు చేస్తున్నప్పటికీ కమర్షియల్ గ్యాస్ కోసం, ఇంట్లో వాడుకునే వంట గ్యాస్ కోసం అటు వ్యాపారులు, ఇటు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేస్తే మూడు రోజులపాటు గ్యాస్ కోసం ఎదురు చూడవలసి వస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు. పలు చోట్ల గ్యాస్ కోసం ఉదయాన్నే క్యూలైన్లో నిలబడి ఎదురు చూస్తున్నారు. కొందరు అయితే బయట కట్టలను కొనుగోలు చేసి కట్టెల పొయ్యిని వినియోగిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్యాస్ కొరత ఉండటంతో తమ కష్టాలు ఎప్పుడు తీరతాయోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. హోటల్ వ్యాపారులు కట్టెల పొయ్యి మీద వంట పదార్థాలు తయారు చేయడం కనిపిస్తుంది.

గ్యాస్ కష్టాలు :
మచిలీపట్నం సుకర్లాబాద్ లోని ఇండియన్ గ్యాస్ కంపెనీ గోడౌన్ వద్ద గ్యాస్ కోసం మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున బారులు తీరారు. గ్యాస్ బండలను క్యూలో పెట్టి నిరీక్షిస్తున్నారు.
