AP | యువతకు స్ఫూర్తి.

AP | యువతకు స్ఫూర్తి.

  • మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో వివేకానందుడి జయంతి వేడుకలు

AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయ‌న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఆలోచనలు, సేవా భావం, యువతకు అందించిన స్ఫూర్తిదాయక సందేశాలను గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచీ దుర్గాప్రసాద్ నాని, టౌన్ పార్టీ కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్, నాగేశ్వర స్వామి గుడి చైర్మన్, మహిళా నాయకురాలు లంబిశెట్టి నీరజ, పట్టణ ఉపాధ్యక్షుడు వేమూరి సాయి మాట్లాడుతూ “వివేకానంద ఆలోచనలు ప్రతీ యువకుడికి ప్రేరణ. ఆయన చూపిన మార్గం క్రమశిక్షణ, సేవ, ఆత్మవిశ్వాసం కలగలిపినది. ఎదుగు, మేల్కొను, లక్ష్యం చేరే వరకు ఆగిపోకు అనే ఆయన సందేశం మార్గదర్శకం కావాలి” అని పేర్కొన్నారు.

అలాగే యువతలో ఆత్మబలాన్ని పెంపొందించేలా వివేకానంద ఆశయాలను అనుసరించాలని, సమాజ సేవను జీవిత ధ్యేయంగా చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మరకానిపుర బ్రహ్మం, యువరాజ్, గున్నం నాగబాబు, బొడ్డు నాగరాజు, తిరుమాని నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply