AP | శ్రీకాకుళం రచయితకు ఛత్రపతి శివాజీ సేవా పురస్కృతి..

AP | శ్రీకాకుళం రచయితకు ఛత్రపతి శివాజీ సేవా పురస్కృతి..
AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : ఛత్రపతి శివాజీ జయంతి మహోత్సవాల సందర్భంగా, ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ లో జరిగే పురస్కృతికి శ్రీకాకుళం పత్రికా రచయిత జంధ్యాల శరత్ బాబు ఎంపికయ్యారు. మూడు దశాబ్దాల చరిత్ర గల భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ జాతీయ సేవా పురస్కారం పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసి ఆహ్వానించిన సీనియర్ జర్నలిస్ట్ లలో ఆయన ఉన్నారు. పత్రికలు, టీవీలు, ఇతర సామాజిక మాధ్యమాల రంగంలో పత్రికల విభాగంలో శరత్ బాబుకు అవార్డు బహూకరిస్తారు. వచ్చే గురువారం హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ప్రాంతం శివాజీ విగ్రహం వద్ద బహిరంగ సభలో పురస్కార ప్రదానం ఉంటుందని సంస్థ అధ్యక్షుడు నందనం దివాకర్ ప్రకటించారు.
