Anushka | ఈసారైనా మెప్పించేనా..?

Anushka | ఈసారైనా మెప్పించేనా..?

Anushka | అనుష్క కెరీర్ టర్నింగ్ పాయింట్ – ‘అరుంధతి’ నుంచి స్టార్‌డమ్
మలయాళంలో ఫస్ట్ టైమ్ – ‘కథనార్’తో కొత్త ప్రయోగం
ట్రైలర్ విశ్లేషణ – విజువల్స్, డైలాగ్స్, యాక్షన్ హైలైట్స్
అనుష్క పాత్రపై చర్చ – విలన్ టాక్ నిజమా..?
సోషల్ మీడియాలో రియాక్షన్స్ – ఫ్యాన్స్ ఎమోషన్స్ మిక్స్

Anushka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అనుష్క.. ఒకప్పుడు చాలా స్పీడుగా సినిమాలు చేసేది కానీ.. ఇప్పుడు చాలా స్లోగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం అనుష్క చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా కథనార్. ఇది మలయాళంలో రూపొందుతోన్న సినిమా. ఈ సినిమాలో (Movie) అనుష్క క్యారెక్టర్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ.. ట్రైలర్ ఎలా ఉంది..? అసలు ఇందులో అనుష్క ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది..?

Anushka | టర్నింగ్ పాయింట్ అదే..

సూపర్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన అనుష్క.. అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అరుంథతి సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది.. ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇంకా చెప్పాలంటే.. అరుంధతి అనుష్క (Anushka) కెరీర్ లో టర్నింగ్ పాయింట్. బాహుబలి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్ధం.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో పవర్ ఫుల్ రోల్స్ తో ఆకట్టుకుంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే.. అనుష్కనే చేయాలి అనేంతగా గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే.. ఆమె క్రేజ్ పెరిగి వరుసగా భారీ ఆఫర్స్ వచ్చినా.. ఏ సినిమాపడితే ఆ సినిమా చేయడం లేదు. తనకు బాగా నచ్చితేనే చేస్తుంది.

Anushka

Anushka | ఫస్ట్ టైమ్ మలయాళంలో..

ఇప్పుడు ఫస్ట్ టైమ్ మలయాళంలో కథనార్ అనే సినిమాలో నటించింది. అయితే.. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అనుష్క ఏంటి..? విలన్ పాత్ర పోషించడం ఏంటి..? అనే కామెంట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు. విజ్ఞానం యొక్క రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు.. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు.. ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయాజాలం.. మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన.. చేర మహారాజుకి కుంచమున్ తరుపున శుభాకాంక్షలు’.. ‘చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే’.. ‘కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం’.. ‘ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?’.. ‘మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది’.. ‘మాయ.. ప్రపంచమే మాయ’ అంటూ సాగిన డైలాగ్స్‌తో ట్రైలర్ అద్భుతంగా ఉంది.

Anushka

Anushka | ట్రైలర్ అదిరింది..

ఇక ఈ ట్రైలర్‌లో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా తదితరులను చూపించిన తీరు, ఒక్కో పాత్ర, వారి లుక్‌ను రివీల్ చేసిన తీరు బాగుంది. యాక్షన్ (Action) సీక్వెన్స్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉందనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఇండియన్ సినీ లవర్స్‌కి నెవ్వర్ బిఫోర్ అనిపించేలా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీని రోజిన్ థామస్ తెరకెక్కించారు. అయితే.. ఈ ట్రైలర్ లో అనుష్క ఎక్కువ సేపు కనిపించలేదు.. పైగా విలన్ క్యారెక్టర్ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో అనుష్కకు ఇది అవసరమా..? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. త్వరలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. మరి.. అనుష్క ఈ సినిమా చేయడం కరెక్టా..? కాదా..? తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Anushka

Leave a Reply