Anushka | అనుష్క, అడివి శేష్ మధ్య ఏం జరిగింది..?

Anushka | అనుష్క, అడివి శేష్ మధ్య ఏం జరిగింది..?
Anushka | అనుష్కతో అడివి శేష్ అనుభవం
బాహుబలి షూటింగ్‌లో జరిగిన షాకింగ్ ఘటన
రాజమౌళి సూచనతో జరిగిన సీన్
అనుష్క స్వభావం పై శేష్ ప్రశంసలు
డెకాయిట్ మూవీపై శేష్ నమ్మకం
Anushka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అడివి శేష్.. డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. కెరీర్ లో దూసుకెళుతున్నాడు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలతో.. వరుసగా సక్సెస్ సాధించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు డెకాయిట్ (Dacoit) అనే సినిమాతో.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన శేష్.. అనుష్కను కాలితో తన్నిన విషయాన్ని బయటపెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. అనుష్క, అడివి శేష్ మధ్య ఏం జరిగింది..?
Anushka | అనుష్కతో ప్రయాణం..
డెకాయిట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుమ.. శేష్ తో చేసిన ఇంటర్ వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. ఈ ఇంటర్ వ్యూలో బాహుబలి సినిమా టైమ్ లో అనుష్కతో తన ప్రయాణం గురించి చెప్పాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ (Prabhas) హీరోగా అనుష్క హీరోయిన్ గా నటించగా.. విలన్ భళ్లాలదేవగా రానా నటిస్తే.. ఆయన కుమారుడుగా అడివి శేష్ నటించారు. అయితే.. ఓ సన్నివేశంలో అనుష్కని మెడ పై శేష్ తన్నాలట. ఆ సీన్ కోసం శేష్ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ఇంటెన్సిటీ రావడం లేదట. అప్పుడు రాజమౌళి చాలా ఫోర్స్ గా తన్నమని చెప్పారట.

Anushka | అందుకే.. అనుష్క స్వీట్..
రాజమౌళి చెప్పడం.. అప్పటికే ఎన్ని సార్లు చేసినా ఆ సీన్ కరెక్ట్ గా రాకపోవడంతో.. చాలా గట్టిగా తన్నాను.. ఆ సమయంలో అనుష్క (Anushka) మెడ భాగం బెణికినట్లు అనిపించింది. అంత బలంగా తన్నినా సరే.. అనుష్క ఏ మాత్రం బాధపడలేదు. సీన్ బాగా వచ్చిందా..? లేదా..? అని మాత్రమే ఆలోచించింది. అందుకే.. అనుష్క పేరు తగ్గట్టుగా చాలా స్వీట్ అంటూ అభినందించి అసలు విషయం బయపెట్టాడు శేష్. అది మేటర్. శేష్ డెకాయిట్ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ మూవీ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ నెల 10న డెకాయిట్ రిలీజ్ కానుంది. మరి.. శేష్ నమ్మకం ఎంత వరుకు నిజం అవుతుందో చూడాలి.

