కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం

కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా పాదన. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం ప్రధాన సంచాలకులు స్వాతి లక్రా IPS సూచనల ప్రకారం, TGSPF అడిషనల్ కమాండెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వరంగల్ యూనిట్ TGSPF సిబ్బంది అందరూ కలసి ఎస్పీఎఫ్ వరంగల్ ఇన్స్పెక్టర్ బీమా నాయక్ ప్రోత్సాహంతో SI తిరుపతి రెడ్డి ASI ఆదినారాయణ సిబ్బంది తో కన్నతల్లి అనాధాశ్రమం వృద్ధాశ్రమం ,వరంగల్ నందు అన్నదానం దుప్పట్లు పంచడమైనది.
ఎస్సై తిరుపతి రెడ్డి టీఎస్పీఎఫ్ పోలీస్
సిబ్బంది సహకారంతో గురువారంఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని..టీజీఎస్పి పోలీస్ వరంగల్ యూనిట్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు ముందు సహాయం కావాలంటే మేము చేసినందుకు ముందుకు వస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమం చేయుటకు ప్రోత్సహించిన డీజీ స్వాతి లక్రాకి, సహాయ సహకారాలు అందించిన టీజీఎస్పీఎఫ్ పోలీస్ వరంగల్ యూనిట్ సిబ్బందికి కన్నతల్లి అనాధాశ్రమం వృద్ధాశ్రమం కన్వీనర్ రాజన్ బాబుకి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో టీజీఎస్పీఎఫ్ పోలీస్ హెడ్కానిస్టేబుల్స్ ఆల్లస్వామి, వేణు రవీందర్ ,మధు ,రవి కానిస్టేబుల్స్ సందీప్ ,రవికిరణ్, రమేష్ ,చిరంజీవి ,రాజేందర్,అరుణ్ విజేందర్,సాయి ,భార్గవ్ పాల్గొన్నారుమొక్కజొన్న కష్టాలు
