గాజులపల్లిలో అంగన్‌వాడీ అన్నప్రాసన కార్యక్రమం

మంథని రూరల్, ఆంధ్రప్రభ : మంథని మండలం గాజులపల్లి గ్రామంలో సర్పంచ్ కారెంగుల సుధాకర్ అధ్యక్షతన అన్నప్రాసన కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ.. పిల్లలకు పౌష్టికరమైన ఆహారం అంగన్వాడీల ద్వారా అందించబడుతుందని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలను అర్హులైన గ్రామస్తులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలక సభ్యులు, పంచాయతీ సెక్రెటరీ, అంగన్వాడి సూపర్వైజర్, అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply