అంబేద్కర్ జాతరను వేడుకగా నిర్వహించుకుందాం..

అంబేద్కర్ జాతరను వేడుకగా నిర్వహించుకుందాం..
- జాతర కమిటీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి హాజమ్మ
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; భారతరాజ్యాంగ నిర్మతడాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతరను వేడుకగా జరుపుకుందామని నారాయణపేటజిల్లా జాతర కమిటీ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి హాజమ్మ పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేటజిల్లాఊట్కూర్ అంబేద్కర్ కళాభవనంలో జాతర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊట్కూర్ నగర జాతర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరివాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ జాతర ఘనంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగాకృషిచేయాలన్నారు. ఏప్రిల్ 16న నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే అంబేద్కర్ జాతరకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతంచేయాలనికోరారు. అనంతరం ఊట్కూర్ అంబేద్కర్ జాతర నగర అధ్యక్షులుగా తల్వార్ నాగరాజ్, ఉపాధ్యక్షులుగా దుర్గం కాడి రాకేష్ ,ఉమా,ప్రధాన కార్యదర్శిగా నరేష్,సహకార్యదర్శిగా దేవర తరుణ్ ,శంకర్ మోహన్,కోశాధికారిగా లావరీ బలరాం,కార్యవర్గ సభ్యులుగా తిమ్మప్ప అభిషేక్ వర్ష శోభరాణి, సలహాదారులుగా శ్రీరామ్,నగర్ అంబేద్కర్ సంఘం నాయకులు ఆర్. హన్మంతు, నర్సింగప్ప,నారాయణ, తిమ్మప్ప,గోపాల్ అశోక్ టీచర్ శంకర్ లక్ష్మణ్ మల్లేష్ గౌతమ్ తదితరులను ఎన్నుకొని ఘనంగా సన్మానించారు.
