అమరావతి రాజధాని అజరామంగా చరిత్రలో నిలుస్తుంది

అమరావతి రాజధాని అజరామంగా చరిత్రలో నిలుస్తుంది

  • టీడీపీ రాష్ట్ర మాజీ పరిశీలకులు హనుమంతరావు

శావల్యాపురం, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని అజరామంగా చరిత్రలో నిలుస్తుందని టీడీపీ రాష్ట్ర మాజీ పరిశీలకులు, రాష్ట్ర రైతాంగ పోరాట కమిటీ నాయకులు ముండ్రు హనుమంతరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని భారత పార్లమెంట్లో ఆమోదించడం శుభపరిణామమని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మండల కేంద్రమైన శావల్యాపురంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించడంతో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతాయన్నారు. పీఎం నరేంద్రమోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply