Allu Arjun | లైనప్ మామూలుగా లేదుగా..

Allu Arjun | లైనప్ మామూలుగా లేదుగా..

Allu Arjun | పాన్ ఇండియా క్రేజ్ తర్వాత బన్నీ ఫుల్ బిజీ
అట్లీ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్
లోకేష్ కనకరాజ్‌తో మరో భారీ ప్రాజెక్ట్
బన్నీ – బాసిల్ జోసెఫ్ కాంబో సెట్ అవుతుందా..?
సూపర్ హీరో కథతో రాబోతున్న కొత్త సినిమా..?
అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

Allu Arjun | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రేజ్ కు తగ్గట్టుగా బన్నీతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు కానీ.. బన్నీ మాత్రం సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్న బన్నీ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఈసారి ఏ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు..?

Allu Arjun | బన్నీ, బాసిల్ జోసెఫ్‌..

Allu Arjun

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న మూవీ అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఆ భారీ క్రేజీ మూవీ రిలీజ్ కాకుండానే ఈ ఇయర్ లోనే మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్ తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఇప్పుడు మరో సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. ఈసారి మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చాయి కానీ.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు.

Allu Arjun | సూపర్ హీరో స్టోరీ..

Allu Arjun

ఇప్పుడు ఈ వార్త బయటకు రావడానికి కారణం ఏంటంటే.. అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ సందడి చేశాడు. దీంతో బన్నీ, బాసిల్ కాంబో సెట్ అయినట్టే అనే టాక్ మొదలైంది. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సరిపోయేలా ఓ డిఫరెంట్ స్టోరీ లేదా సూపర్ హీరో స్టోరీని బాసిల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కాంబో సెట్ అయితే.. తెలుగు, మలయాళంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఈ మూవీ సెన్సేషనే. ఈ కాంబో సెట్ అయినా.. ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే.. చాలా టైమ్ పట్టేలా ఉంది. లోకేష్‌ కనకరాజ్ తో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తారేమో అని టాక్. ఏది ఏమైనా బన్నీ లైనప్ మామూలుగా లేదుగా..

Allu Arjun

CLICK HERE TO READ

CLICK HERE TO READ MORE

Leave a Reply