ఆలేరులో చిన్నారుల హోలీ సంబరాలు

ఆలేరులో చిన్నారుల హోలీ సంబరాలు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో చిన్నారులు మంగళవారం హోలీ సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. చిన్నారులు రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలను హోరెత్తించారు. ఇంటింటికి వెళ్లి చిన్నారులు రంగులు పోస్తూ హోలీ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆనందించారు. చిన్నారుల హోలీ వేడుకలను పెద్దలు ఆసక్తిగా చూశారు. సంకల్ప, హాని, మిన్ను, సమీక్ష, జున్ను, పండు, అన్విక, దీక్షు తదితర చిన్నారులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.
