Air India | టేకాఫ్ టైంలో టెక్నిక‌ల్ ఇష్యూ…

  • గన్నవరంలో నిలిచిన విమానం…
  • ఫ్లైట్ లో మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి

విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం గురువారం రాత్రి టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం నిలిచిపోయింది. రాత్రి 8:10 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమై వేగం పెంచుతున్న క్రమంలో.. అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. సరిగ్గా గాలిలోకి ఎగిరే (టేకాఫ్) క్షణాల్లో ఈ సమస్య తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను ప్రమాదం నుండి రక్షించారు.

ఈ విమానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రయాణించాల్సి ఉండగా, ఈ అంతరాయం కారణంగా ఆయన స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు తిరిగి చేరుకున్నారు. ప్రస్తుతం విమానంలోని లోపాలను సరిచేసే పనులు జరుపుతున్నాయి.

Leave a Reply