నకరికల్లులో గ్యాస్ సెగ..

నకరికల్లులో గ్యాస్ సెగ..
ఖాళీ సిలిండర్లతో వినియోగదారుల ధర్నా…
నకరికల్లు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గ్యాస్ వినియోగదారులు సోమవారం ఖాళీ సిలిండర్లతో రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఆన్‌లైన్ బుకింగ్‌లో తలెత్తుతున్న సర్వర్ సమస్యల కారణంగా సకాలంలో సిలిండర్లు అందడం లేదని, ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నిరసనతో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే సాంకేతిక లోపాలను సరిదిద్ది గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని నిరసనకారులు డిమాండ్ చేయగా సమాచారం అందుకున్న అధికారులు సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
