AFG vs ENG | ఇంగ్లండ్ ను “శ‌త‌కొట్టిన” ఇబ్ర‌హీం జ‌డ్రాన్


లాహోర్ : ఛాంపియ‌న్స్ ట్రోఫిలో భాగంగా ఇంగ్లండ్ తో గ‌డ్డాఫి స్టేడియంలో నేడు (బుధవారం) జ‌రుగుతున్న మ్యాచ్ లో అప్ఘానిస్థాన్ బ్యాట‌ర్స్ చిత‌క‌కొట్టేశారు. ముఖ్యంగా ఇబ్ర‌హీం జడ్రాన్ శ‌త‌కంతో చెల‌రేగిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే వేదికపై ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్ (165) ఆస్ట్రేలియాపై నమోదు చేసిన రికార్డు స్కోరును అధిగమించి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇబ్రహీం రికార్డు సృష్టించాడు.

ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగిన ఇబ్ర‌హీం 177 ప‌రుగులు చేసి మ్యాచ్ అఖ‌రి ఓవ‌ర్ లో ఔట‌య్యాడు. అత‌డి స్కోర్ లో ఆరు సిక్స్ లు 12 ఫోర్లు ఉన్నాయి. ఈ ప‌రుగుల‌ను 146 బంతుల‌లోనే పూర్తి చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన మొదటి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా జద్రాన్ నిలిచాడు.

37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అహ్మదుల్లా షాహిదితాతో కలిసి ఇబ్రహీం ఆదుకున్నాడు. ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్ కు 103 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర్వాత న‌బీ (24 బంతుల్లో 40) , ఓమ‌ర్జాయ్ (31 బంతుల్లో 41) తో క‌ల‌సి స్కోర్ ను ప‌రుగెత్తించాడు. దీంతో అప్ఘ‌నిస్తాన్ నిర్ధారిత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 325 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలవాలంటే 326 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఇక, ఈ మ్యాచ్ తో ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్టు.. ఇప్పటివరకు ఆడిన 50 ఓవర్ల ఐసీసీ ఈవెంట్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు న‌మోద చేయ‌గా.. నేటి మ్యాచ్ లో 325/7 ప‌రుగులు సాధించి ఆ రికార్డును బ్రేక్ చేసింది.

ఐసీసీ ఈవెంట్లలో ఆఫ్ఘనిస్థాన్ అత్యధిక స్కోరు

325/7 vs ఇంగ్లండ్, లాహోర్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ – నేడు*
291/5 vs ఆస్ట్రేలియా, ముంబై – ODI ప్రపంచ కప్ – 2023
288 vs వెస్టిండీస్, లీడ్స్ – ODI ప్రపంచ కప్ – 2019
286/2 vs పాకిస్తాన్, చెన్నై – ODI ప్రపంచ కప్ – 2023
284 vs ఇంగ్లాండ్, ఢిల్లీ – ODI ప్రపంచ కప్ – 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *