Adilabad | చిన్నారులలో భయం భయం

Adilabad | చిన్నారులలో భయం భయం

Adilabad | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో వీధి కుక్కలతో అటు గ్రామాల మహిళలు ఇటు చిన్నారులలో క్షణం క్షణం భయం భయం. మండల కేంద్రంతో పాటు ముతనుర్, ఆయా గ్రామాలలో వీధి కుక్కలు, పిచ్చి కుక్కల కాటుతో గ్రామాలలో భయ వాతావరణం క‌నిపిస్తుంది. గత ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాదయాత్ర(hiking) కొనసాగుతుండగా వీధి కుక్కలు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను కాటు వేయడంతో గాయపడి రాత్రి వేళలో చికిత్స పొందారు.

ఆ సమయంలో పాదయాత్రలో ఆటంకం కలిగింది. అప్పటి స్థానిక సర్పంచ్ కోరేంగా సుంగట్రావు సొంతంగా తన అనుచరులతో కుక్కలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినా ప్రస్తుతం అప్పటి నుండి ఇప్పటివరకు కుక్కల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముత్తునూరు గ్రామంలో రోజుకు ఒకరిద్దరిని కుక్కలు కాటేయడంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.

కుక్క కాటుకు ర్యాబిస్ ఇంజక్షన్లు(Rabies injections), మండల కేంద్రంతో పాటు, మండలంలోని పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడు ఏ కుక్క వచ్చి కరుస్తదో అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై దృష్టి సాధించవలసిన అవసరం ఉందని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

Leave a Reply