అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : 14 15 వ వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ 14 15 కుప్పి రాజశేఖర్, ఆర్నె సంధ్య, వార్డులలో విశిష్ట ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా ఎలాంటి పనులు చేయలేదని, గతంలో మా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులకే, శిలాఫలకాలకు కొబ్బరికాయలు కొడుతూ జనాన్ని మభ్యపెడుతున్నారని, అన్నాడు. ఈ మున్సిపల్ ఎలక్షన్లలో టిఆర్ఎస్ నిలబడ్డ అభ్యర్థులను ఖ్యాతనపల్లి ప్రజలు అత్యధికతో మెజార్టీ గెలిపించి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ అభిమానులు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.+

Leave a Reply