అడిషనల్ కలెక్టర్‌కు సన్మానం

అడిషనల్ కలెక్టర్‌కు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు( ఐఏఎస్ )ను ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ప్రసాదాన్ని అందజేశారు.

మున్సిపల్ అభివృద్ధి కృషిలో తమ వంతు సహకారాన్ని అందించాలని అడిషనల్ కలెక్టర్ కు చైర్మన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply