Accident | టిప్పర్ ఢీ .. మహిళ మృతి

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో గురువారం రోడ్డు ప్రమాదం లో ఒక మహిళ మృతి చెందింది. మహాముత్తరం మండలం మీనాజీ పేట గ్రామానికి చెందిన జిల్లల రాజమ్మ (65) రోడ్డు దాటు తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుకున్నారు.. అలాగే లారీని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply