Accident | రోడ్డు ప్రమాదం..

Accident | రోడ్డు ప్రమాదం..

Accident, భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : మోర్తాడ్‌ మండలం గాండ్లపేట్‌ బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకరు మృతి చెందారు. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన పేర్ల కృష్ణ (44), కోట సమ్మయ్య ద్విచక్ర వాహనం పై ఆర్మూర్‌కు వెళ్తున్నారు. మార్గమద్యలో మోర్తాడ్‌ మండలం గాండ్లపేట బ్రిడ్జి వద్ద, ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ ముందున్న ఆటోను ఓవర్‌ టేక్‌ చేస్తూ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పై ఉన్న కృష్ణ కింద పడ్డాడు. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, సమ్మయ్యకు గ్రాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మెట్‌పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో కృష్ణ మృతి చెందాడు. మృతుడి తండ్రి పేర్ల శైలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply