మోత్కులపల్లి వాగులో గ‌ల్లంతు

మోత్కులపల్లి వాగులో గ‌ల్లంతు

అక్కన్నపేట, ఆంధ్రప్రభ : హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవర పల్లి మండలానికి చెందిన దంపతులు ప్రణయ్ (28), కల్పన(24) అక్కన్నపేట మండలానికి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మోత్కులపల్లి వాగులో కొట్టుకుపోయారు. ప్ర‌ణ‌య్‌ది భీమదేవరపల్లి కాగా, బుధవారం తన అత్తగారింటికి అక్కన్నపేటకు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మోతుకులపల్లి వాగులో వారి ద్విచక్ర వాహనం లభ్యం అయింది. ఈ దంపతులు వాగులో కొట్టుకుపోయారా లేదంటే తప్పించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి రెస్క్యూ సిబ్బంది వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply