Accident | సమయస్ఫూర్తి చాటిన మంత్రి కోమటి రెడ్డి..

Accident | సమయస్ఫూర్తి చాటిన మంత్రి కోమటి రెడ్డి..

మానవత్వం చాటుకున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
చిట్యాల సమీపంలో ప్రమాదాన్నికి గురైనా ఇద్దరూ వ్యక్తులు
కాన్వాయ్ ఆపి గాయపడినవారిని ఆసుప్రతికి తరలించిన మంత్రి

Accident | చిట్యాల, ఆంధ్ర ప్రభః చిట్యాల సమీపంలోని గుండ్రంపల్లి వద్ద జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాన్ని గమనించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించారు. నల్లగొండ నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో చిట్యాల సమీపంలో ఇద్దరూ వ్యక్తులు ప్రమాదాన్ని గురైయ్యారు. ఇది గమనించిన మంత్రి తన కాన్వాయ్‌ను తక్షణమే ఆపి, గాయపడినవారిని అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వైద్యులతో మాట్లాడి బాధితులకు తక్షణ వైద్యసహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. ఇది చూసిన వారంత మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply