ACB attack | ఏసీబీ వలలో.. డిప్యూటీ తహసీల్దార్
ACB attack | నల్గొండ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా (Nalgonda District) చండూరు తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ (Deputy Tahsildar) గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గట్టుప్పల్ (మం) తెరట్ పల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద బాధితులు వివరాలు కోరారు.
వివరాలు అందించినందుకు గాను రూ.20వేలు ఇవ్వాలని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో చంద్రశేఖర్ బాధితుల నుండి రూ.20,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ చంద్రశేఖర్ ను ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.

