విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం..

విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం..

మహమ్మదాబాద్, ఆంధ్రప్రభ : క్లాస్ రూమ్ పైకప్పుఊడి విద్యార్థుల తలలకు గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులకు తృటిలో ప్రమాదం తప్పింది. విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని డీఈఓ ప్రవీణ్ కుమార్ చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని నంచర్ల గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల 1993 సంవత్సరంలో నిర్మించారని.. మన ఊరు మనబడి అనే కార్యక్రమం ద్వారా మూడు సంవత్సరాల క్రితం పై కప్పుకు కాంట్రాక్టర్లు మరమ్మత్తులు చేశారని తెలిపారు. ఉపాధ్యాయురాలు పుష్పలత రెండవ తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తుండగా అనుకోకుండా క్లాస్ రూమ్ పైకప్పు ఊడి విద్యార్థుల తలల పై పడగా విద్యార్థుల తలలకు గాయాలు అయ్యాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే పాఠశాలను సందర్శించి విద్యార్థులని పరామర్శించామని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హెడ్మాస్టర్ రేణుకా దేవి, భీమ్ రెడ్డి, టీచర్లు గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి విద్యార్థులను తీసుకెళ్లగా ఆర్ఎంపీ డాక్టర్ ప్రథమ చికిత్స అందించారని ప్రస్తుతం విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని అన్నారు.

Leave a Reply