గెలుపు దిశగా నిచ్చకోల వంశీకృష్ణ..

గెలుపు దిశగా నిచ్చకోల వంశీకృష్ణ..

  • 2వ వార్డులో హోరెత్తిన ప్రచార ర్యాలీ
  • బ్యాటు గుర్తుకు ఓటు వేస్తాం..
  • వంశిని భారీ మెజార్టీతో గెలిపించకుంటాం..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 2వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిచ్చకోల వంశీకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రచార ర్యాలీ విజయవంతమైంది. వార్డులోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వందలాది మంది ప్రజలు, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని వంశీకృష్ణకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఓటర్ల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన చూస్తుంటే వంశీకృష్ణ విజయం ఖాయమని స్థానిక నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నానని, తన ఎన్నికల గుర్తు అయిన ‘బ్యాటు’ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

వార్డు అభివృద్ధి కోసం తపించే వ్యక్తిగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా వంశీకృష్ణ గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2వ వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా వార్డులోని అన్ని వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు.

పట్టణ ప్రగతిలో 2వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేశారు. ర్యాలీ పొడవునా మహిళలు వంశీకృష్ణకు మంగళ హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. ప్రజల కోసం కష్టపడే తత్వం ఉన్న నాయకుడిగా వంశీకృష్ణను గెలిపించుకుంటామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఆయన గెలుపు కేవలం వ్యక్తిగత విజయం కాదని, అది 2వ వార్డు అభివృద్ధికి నాంది అని స్థానిక నాయకులు కొనియాడారు. వార్డులోని ప్రతి ఓటరు ఆశీస్సులు తీసుకుంటున్న వంశీకృష్ణ, తనను గెలిపిస్తే వార్డు రూపురేఖలు మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply