11,25000 sheep | గొల్లవేష ధారణలో జిల్లా కలెక్టర్

- నట్టల నివారణతోనే పశు ఆరోగ్యం
- జిల్లావ్యాప్తంగా సామూహిక నట్టల నివారణ కార్యక్రమం
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
11,25000 sheep | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని 11 లక్షల 25 వేల గొర్రెలు(11 lakh 25 thousand sheep), మేకలకు కడుపులోని నులిపురుగుల నిర్మూలనకు వాటి ఎదుగుదలకు దోహదం చేసే నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.


నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల పరిధిలోని చిన్న ముద్దునూర్ గ్రామంలో జిల్లా పశుసంవర్ధక శాఖ(Animal Husbandry Department) ఆధ్వర్యంలో ఇవాళ సామూహిక నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గొల్ల వేషధారణలో కనిపించారు. రైతులతో కలిసిపొయారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై రైతులు, పశుపోషకులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా నిర్వహిస్తున్న ఈ సామూహిక నట్టల నివారణ కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం(proper utilization) చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నట్టల వల్ల పశువులు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, వాటి కారణంగా రక్తహీనత(Anemia), బరువు తగ్గడం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని వివరించారు. పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మండలాల వారిగా 50 బృందాలుగా పశువైద్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా గొర్రెలు, మేకల పెంపకందారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ జీవాలకు నట్టల మందులను తప్పనిసరిగా తాగించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

నట్టల నివారణ మందులు తాగించడం వల్ల పశువుల శరీరంలో ఉన్న అంతర్ పరాన్నజీవులు పూర్తిగా నశించి పశువులు ఆరోగ్యంగా మారుతాయని, దాంతో పాటు వాటి బరువు పెరగడం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపడటం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.
పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతు జీవన ప్రమాణం మెరుగుపడుతుందని, వ్యవసాయం(Agriculture)–పశుసంవర్ధక రంగాలు పరస్పర ఆధారంగా అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞాన శేఖర్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గొర్రెలు–మేకల పెంపకందారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
