రామకృష్ణ ప్రసాద్ కు ఘన సత్కారం..

రామకృష్ణ ప్రసాద్ కు ఘన సత్కారం..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం అందుకున్న ప్రముఖ జానపద గాయకులు సూరగం రామకృష్ణ ప్రసాద్ ను అవనిగడ్డ శ్రీ లంకమ్మ అమ్మవారి గుడి చైర్మన్ అన్నపురెడ్డి వెంకటస్వామి ఘనంగా సత్కరించారు. జానపద కళారంగంలో రామకృష్ణ ప్రసాద్ చేసిన విశిష్ట కృషికి ఇంకా ఎన్నో ఉత్తమ పురస్కారాలు అందుకోవాలని అన్నపురెడ్డి ఆకాంక్షించారు. శ్రీ లంకమ్మ అమ్మవారి సన్నిధిలో రామకృష్ణ ప్రసాద్ ను దుశ్యాలువాతో సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులు, రామకృష్ణ ప్రసాద్ కు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడిసేవ విష్ణు ప్రసాద్, సిబ్బంది వెంకటేశ్వరరావు ప్రముఖులు పాల్గొన్నారు.
