ప్రతిభావంతులైన మహిళా ఉద్యోగులకు ఘన సన్మానం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. వివిధ రంగాల్లో విధులను నిర్వహిస్తూ ప్రతిభ కనబరుస్తున్న మహిళా సభ్యులను శాలువాలతో తగు రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం వివిద రంగాల్లో రాణిస్తున్న జ్యోతి కోటేశ్వరి, గౌరి, కవిత, సుమలత, ఈశ్వరి, పోచమ్మ, సరితలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply