బాలాజీహిల్స్‌లో దారుణం..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాకు చెందిన స్వాతి (25) అనే గర్భిణీని ఆమె భర్త మహేందర్ రెడ్డి హత్య చేశాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ ఘోరమైన సంఘటనలో మహేందర్ రెడ్డి తన భార్యను చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలను కవర్లలో ప్యాక్ చేసి బయట పడేయడానికి సిద్ధమయ్యాడు. అయితే, వారి గది నుంచి వింత శబ్దాలు రావడంతో పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, కవర్లలో ఉన్న శరీర భాగాలను గుర్తించారు.

పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా స్వాతి కాళ్లు, చేతులు, తల వేరు చేసి మూసీ నదిలో పడేసినట్లు మహేందర్ అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు ఆ శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Leave a Reply