CM Relief Fund | సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

CM Relief Fund | సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

  • సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

CM Relief Fund | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదల పాలిట వరం లాంటిదని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం గ్రామ సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామానికి చెందిన నలుగురికి మంజూరైన రూ. 97వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

కొంతం శ్రీనివాస్ రెడ్డికి రూ.44,500 లు, ముటుకుల్లోజు శ్రీనివాసచారికి రూ.30,500లు, వల్లబోతు స్వామికి రూ.14వేలు, సామిడి యాదమ్మ కు రూ.13వేల చొప్పున మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా జువ్వి నర్సింహ్మ మాట్లాడుతూ… సీఎం సహాయనిధి చెక్కుల మంజూరుకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు వల్లబోతు నారాయణ, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు శారద లింగస్వామి, మాజీ ఉప సర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, కొంతం పద్మ రాంరెడ్డి, ఊదరి లింగయ్య, వల్లబోతు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply