Municipal | ఎన్నికల్లో టీఆర్ఎస్ జండా ఎగరాలి

Municipal | ఎన్నికల్లో టీఆర్ఎస్ జండా ఎగరాలి

  • మాజీ ఎమ్మెల్యే ఆనంద్

Municipal | వికారాబాద్, ఆంధ్రప్రభ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ మునిసిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనంద పిలుపునిచ్చారు. పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్ నేతృత్వంలో మున్సిపల్ పరిధిలోని రామయ్య గూడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈసందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ… మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆర్ మల్లేశం, ఆర్ లింగం, మాజీ కౌన్సిలర్ కొండేటి కృష్ణ, నాయకులు సుభాన్ రెడ్డి, మృతుజా, పట్టణ ప్రధాన కార్యదర్శి గాండ్ల మల్లికార్జున్ నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply