Kadem | ఘనంగా ప్రియాంకా గాంధీ జన్మదిన వేడుకలు

Kadem | ఘనంగా ప్రియాంకా గాంధీ జన్మదిన వేడుకలు
Kadem | కడం, ఆంధ్రప్రభ : కడెం మండలం పెద్దూర్ కొలంగూడ గ్రామంలో పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద గిరిజన కుటుంబాల చలి తీవ్రత గ్రహించి వారి కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ నచ్చన్ ఎల్లపుర్ గ్రామ సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి, స్పందన గంగన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి మోడీకే మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వాజిద్ ఖాన్, మహమ్మద్ సలీం, వెంకటేష్, ధర్మయ్య, తిరుపతి రెడ్డి, రాజేశ్వర్ పాల్గొన్నారు.
