Konijeti Rosaiah Wife Passes Away | రోశయ్య సతీమణి కన్నుమూత..

Konijeti Rosaiah Wife Passes Away | రోశయ్య సతీమణి కన్నుమూత..
Konijeti Rosaiah Wife Passes Away, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి (86) కన్నుమూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ఆమె సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ అమీర్‌పేటలోని తన నివాసంలో శివలక్ష్మి తుదిశ్వాస విడిచారు. 2021లో రోశయ్య మరణించిన తర్వాత, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అమీర్‌పేటలోనే నివసిస్తున్నారు.
శివలక్ష్మి నిరాడంబరంకు నిలువుటద్దంగా ఉండేవారు. రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆమె వెన్నంటి ఉండి కుటుంబ బాధ్యతలను చూసుకున్నారు. ఆమె మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. శివలక్ష్మి మరణ వార్త తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి కార్యకర్తలు భారీగా చేరుకొని ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
