Naveen Polishetty | నవీన్ కి ఈ సంక్రాంతి సక్సెస్ అందించేనా..?

Naveen Polishetty | నవీన్ కి ఈ సంక్రాంతి సక్సెస్ అందించేనా..?

Naveen Polishetty | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి.. ఈ మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి. ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం అనగనగా ఒక రాజుతో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ (Srikara Studios) సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఈ నెల 14న రిలీజ్. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ.. ఈ ట్రైలర్ ఎలా ఉంది..?

Naveen Polishetty | నాగ్ వాయిస్ ఓవర్ తో..

దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందిన అనగనగా ఒక రాజు ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. కింగ్ నాగార్జున అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనగనగా ఒక రాజు.. ఆ రాజుకి చాలా పెద్ద మనసు. ఆ మనసులోకి ధగధగా మెరిసిపోయే నగలు వేసుకొని యువరాణి దిగింది అంటూ నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ (Triler) ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఊరి పెద్దమనిషిలా బుల్లెట్ బండి మీద నవీన్‌ పొలిశెట్టి పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. నోట్ల కట్టను గుడిలోని హుండీలో వేయబోతూ కన్నాన్ని పెద్దది చేయండి అని పూజారితో చెప్పడం భలే ఉంది. ట్రైలర్ లోని ప్రతి సంభాషణ గిలిగింతలు పెడుతోంది. మంత్రాన్ని తిరిగి చెప్పమని పూజారి అంటే.. మీనాక్షి చౌదరి గుండ్రంగా తిరగడం నవ్వులు పూయించింది.

Naveen Polishetty

Naveen Polishetty | అదే లక్ష్యం..

నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పాత్రలను మలిచిన తీరు, ఆ పాత్రల నుంచి హాస్యాన్ని పుట్టించిన తీరు కట్టిపడేసింది. నవీన్‌, మీనాక్షి (Meenakshi) ప్రేమకథకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తిని కలిగిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. పండగకు అల్లుడు వస్తున్నాడు అంటూ ఎద్దులబండి పై నవీన్ ను చూపిస్తూ సంక్రాంతికి పండుగను ముందుగానే తీసుకొచ్చారు. సంక్రాంతి అంటేనే.. కుటుంబంతో కలిసి చూసి మనస్ఫూర్తిగా నవ్వుకునే సినిమాలకు పెట్టింది పేరు. ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా అనగనగా ఒక రాజు చిత్రం తెరకెక్కిందని ట్రైలర్ తో స్పష్టమైంది.

Naveen Polishetty

Naveen Polishetty | అంచనాలు తారస్థాయికి..

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) తన కామెడీ టైమింగ్ తో మరోసారి మెప్పించారు. నవీన్, మీనాక్షి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. యువరాజు కెమెరా పనితనం, మిక్కీ జె మేయర్ నేపథ్య సంగీతం ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ట్రైలర్ తో అంచనాలు తారస్థాయికి చేరాయి అనడంలో సందేహం లేదు. నవీన్ పొలిశెట్టి గత చిత్రాలకు మించిన సక్సెస్ ఈ సినిమాతో వస్తుందనే టాక్ వినిపిస్తోంది. మరి.. సంక్రాంతి పోటీలో నవీన్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Naveen Polishetty

CLICK HERE TO READ యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్

CLICK HERE TO READ MORE

Leave a Reply