Savitribai Phule | యువతకు ఆదర్శం

Savitribai Phule | యువతకు ఆదర్శం
- సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడవాలి
Savitribai Phule | నల్గొండ, ఆంధ్రప్రభ : నేటి యువత సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడవాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉన్న పూలే విగ్రహం వద్ద టీఎన్జీవోస్ యూనియన్ కార్యవర్గ సభ్యులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తొలి ఉపాధ్యాయురాలుగా ఆనాడు ఎంతోమందికి విద్యను అందించి చరిత్రలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమ్య సుధా, సంక్షేమ వసతి గృహ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు రణదీప్, భాస్కర్, సైదులు నాయక్, సుమన్, బాలకృష్ణ, నజీర్, సత్యనారాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
