కొనసాగుతున్న లెక్కింపు ప్రక్రియ
గుంటూరు, ఆంధ్రప్రభ : కృష్ణా, గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. తొలిగా బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూమ్ లో నుంచి బయటకు తీసి అభ్యర్థుల సమక్షంలో సీల్ తీశారు. అనంతరం పోలైన బ్యాలెట్ లను కట్టలు కట్టడం ప్రారంభించారు.
తొలిగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో లెక్కింపు ప్రక్రియ మొదలైంది. గుంటూరు-కృష్ణా గుంటూరు పట్టభధ్రుల నియోకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపునకు సంబంధించి మొత్తం పోలైన ఓట్లు 371కాగా, వ్యాలీడ్ (చెల్లుబాటు అయ్యే) ఓట్లు 316, నాన్వాలిడ్ (చెల్లని) ఓట్లు 55. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఫలితం కోసం కూటమి, పీడీఎఫ్ అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.