CAR HIT | దైవ దర్శనానికి వెళ్తూ..

CAR HIT | దైవ దర్శనానికి వెళ్తూ..
- హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
- ముందు వాహనాన్ని ఢీకొట్టిన కారు
- అక్కడికక్కడే ఇద్దరు మృతి
- ముగ్గురికి తీవ్ర గాయాలు
CAR HIT | పామిడి, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లాలోని గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలం వద్ద జాతీయ రహదారి 44 పై తెల్లవారుజామున మూడు గంటల 10 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న భారీ వాహనాన్ని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిక్బల్లాపూర్కు చెందిన వీరు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళుతూ ప్రమాదానికి గురైనట్లు స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
