Collector Dr. Siri | పనితీరుపై సీఎం సమీక్ష..

Collector Dr. Siri | పనితీరుపై సీఎం సమీక్ష..
- వివిధ శాఖల అధికారులతో సమావేశం
- 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు
- హాజరైన కర్నూల్ కలెక్టర్ డాక్టర్ సిరి
Collector Dr. Siri | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగింది. సమావేశానికి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి(Collector Dr. Siri) హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగం సహా వివిధ శాఖల పనితీరుపై సీఎం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ప్రగతిపై ఉన్నతాధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు.
సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “వ్యవసాయం, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లలో సాధించిన త్రైమాసిక ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్థిలా ఎదురు చూస్తాను. ఆ దిశగా అధికారులు లక్ష్యాలను చేరుకునేలా పని చేయాలి” అని స్పష్టం చేశారు. గడచిన రెండు త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈసారి వృద్ధి లక్ష్యాన్ని 17.11 శాతం(17.11 percent)గా నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 17 వర్టికల్స్‌లో ఫలితాలు సాధిస్తేనే జీఎస్డీపీ పెరుగుతుందని చెప్పారు.

లైవ్‌స్టాక్(Livestock), మాన్యుఫాక్చరింగ్, ఫిషింగ్ వంటి విభిన్న రంగాల్లో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగం ఎప్పుడూ డిమాండ్ డ్రివెన్‌గా ఉండాలని, జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు చేయూత ఇస్తున్నామని, ప్రతి యూనిట్(Unit), ప్రతి శాఖలో సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వచ్చే కలెక్టర్ల సదస్సుకు ప్రగతిలో, కలెక్టర్లు–ఉన్నతాధికారుల పనితీరులో క్వాంటం ఇంప్రూవ్మెంట్ కనిపించాలని ఆదేశించారు. పశుగ్రాసం పెంపులో డ్వాక్రా మహిళల(Dwakra Women)ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గతంలో తెలంగాణతో పోటీగా ఉన్న ఏపీ, గత ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దక్షిణ భారతదేశంలో చివరి స్థానానికి చేరిందని, దీన్ని తిరిగి గేర్ అప్ చేసి అగ్రస్థానానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
2024 తర్వాత జీఎస్డీపీ కొంత మెరుగైందని, వ్యవసాయ రంగంపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్(Marketing Intelligence) బలోపేతం చేయాలని, జాతీయ–అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులు పంపగలిగితే వ్యవసాయం సుస్థిరత సాధిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల దిశగా రైతులను సిద్ధం చేయాలని చెప్పారు. ఉద్యాన రంగంలో భారీ పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని, 60–70 వేల కోట్ల(60–70 thousand crores) ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించాలన్నారు.
రబీ–ఖరీఫ్ మూడు సీజన్లకు స్వల్పకాలిక, ఐదేళ్ల మధ్యకాలిక, 10–15 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. డిమాండ్ డ్రివెన్ పంటలు, వాటర్ సెక్యూరిటీ, ఫుడ్ ప్రాసెసింగ్(Food Processing), అగ్రిటెక్ వంటి అంశాలను సమగ్రంగా అమలు చేయాలని ఆదేశించారు. హార్టికల్చర్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్వోదయ కింద అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఎవరు వెనుకపడినా లక్ష్యాలు సాధించడం కష్టమవుతుందని హెచ్చరించారు. గేట్స్ ఫౌండేషన్, అగ్రివాచ్(Agriwatch) వంటి సంస్థల సేవలను వినియోగించి రైతులకు లాభసాటిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సేవల రంగంలో పర్యాటకం కీలకమని, బాపట్ల సూర్యలంక వంటి బీచ్‌ల వద్ద ప్రముఖ బ్రాండ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు..
ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలను గ్రౌండ్(Ground) చేసేందుకు అవసరమైన భూ కేటాయింపులు పూర్తి చేయాలని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఐటీ, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ మంత్రులంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
