Voters | సర్పంచ్ గా గెలిపించండి.. అభివృద్ధి చేస్తా

Voters | సర్పంచ్ గా గెలిపించండి.. అభివృద్ధి చేస్తా

భూత్పూర్ సర్పంచ్ అభ్యర్థి సంగీత శేఖర్ గౌడ్

Voters | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ ముంపు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంగీత శేఖర్ గౌడ్ వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. ఇవాళ‌ ఇంటింటికి.. గడప గ‌డ‌ప‌కు బొట్టుపెట్టి… ఆ ఇంటి మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించారు. బొట్టుపెట్టి.. ఓటు వేయండి.. సర్పంచ్ గా గెలిపించండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అంటూ మాటిచ్చారు. స్థానిక మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి నాయకత్వంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయించడం నా బాధ్యత అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

Voters

15ఏళ్లుగా ముంపులో, మరుగు నీటిలో పురుగు పుట్రతో పడుతున్న బాధ ఇక ఉండదని, త్వరలోనే పునరావాస కేంద్రం ఏర్పాటు అవుతుందని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆశీర్వదించండి ఓటు వేయండి.. సర్పంచిగా గెలిపించండి.. పునరావాస కేంద్రం పక్కాగా ఏర్పాటు చేస్తామన్నారు. ఆలోగా స్థానికంగా ఉన్న సమస్యలు అన్నింటిని పరిష్కరించే బాధ్యత మాదే అంటూ ఆమె మాటిచ్చారు. ప్రచారంలో ప్రజల నుండి సైతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంగీత శేఖర్ గౌడ్ కు మద్దతు లభించిందన్నారు.

ఈ ప్రచారంలో మాజీ ఎంపిటిసి కే.కురుమయ్య గౌడ్, నాయకులు భీమ్ సేన్ రావు, రఘుపతి రెడ్డి, బత్తలయ్య, వాకిటి నాగప్ప, చిన్న బాలయ్య, భీమేష్, రాఘవేందర్ రెడ్డి,చెన్నయ్య గౌడ్, విష్ణువర్థన్ రెడ్డి, జనార్దన్ గౌడ్ ,చిన్న చెన్నయ్య గౌడ్, బొంబాయి నరసింహ, కుర్వ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply